అన్నయ్యా అన్న హీరోయిన్..హర్ట్ ఐన ఆది
on Dec 7, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది. ఐతే ఈవారం ప్రోమోలో లేడీస్ ఎక్కువగా కనిపించి ఎంటర్టైన్ చేయనున్నారు. "సిటీ అమ్మాయిలు వర్సెస్ విలేజ్ అమ్మాయిలు" అనే కాన్సెప్ట్ తో ఈ వారం ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. స్టేజ్ పై హైపర్ ఆది ఎప్పటిలానే అమ్మాయిల మీద పంచులు వేసాడు. "ముఖచిత్రం" మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా .. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియా వడ్లమాని, డైరెక్టర్ సందీప్ రాజ్ తో కలిసి ఈ షోకి హాజరైంది. ఇక ప్రియ కనబడగానే హైపర్ ఆది ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రియ మాత్రం చాలా తెలివిగా అన్నయ్యా అని పిలిచి ఆదిని ఇరుకున పెట్టింది.
దాంతో ఆది సీరియస్ గా స్టేజి మీదనుంచి దిగి వెళ్ళిపోయి అక్కడ కెమెరా రోల్ చేసే ట్రాక్ మీద పడుకుని బాధపడ్డాడు. ఇక ఇంద్రజ వేసిన డాన్స్ మాములుగా లేదు. అలాగే ఈ ఎపిసోడ్ లో ఢీ-14 జోడి టీం లీడర్ శ్వేతా నాయుడు, జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు వంటి లేడీస్ అంతా కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడారు.. అలాగే రాంప్ వాక్ కూడా చేశారు. ఇక మోడల్ జెస్సి వచ్చి అమ్మాయిల ముందు నాంచాక్ తిప్పి కాస్త హడావిడి చేసాడు. ఇది చూసిన ఆది ఆడవాళ్ళ ముందు ఏమిటి నీ పిల్లాటలు అని జెస్సి పరువు తీసేసాడు ఆది.
Also Read